పాట `309
ప: మంగళమే యేసునకు మనుజావతారునకు
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి (మంగ)
1. పరమ పవిత్రునకు పర దివ్యతేజునకు నిరుపమానందునకు
నిపుణ వేద్యునకు ॥మంగ॥
2. దురిత సంహారునకు వర సుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞాన దీప్తునకు ॥మంగ॥
3. సత్యప్రవర్తునకు సద్ధర్మశీలునకు
నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు ॥మంగ॥
4. jక్తస్తోత్రార్హునకు భక్తరక్షామణికి
సత్య పరంజ్యోతియగు సార్వభౌవనకు ॥మంగ॥
5. ఘనుడైన యెహోవా యను పేరట దేవునికి
తనjండై బరుగు సజ్జన పూజ్యునకు ॥మంగ॥
6. నర ఘోరకలుషవల నురుమారంగనిల
నరుదెంచిన మాపాలి వర రక్షకునకు ॥మంగ॥
7. దుర్మరణ శ్రమలకు పేర్మితోనోర్చుచు
ధర్మజ్ఞానవ దెల్పు దైవవాక్యవనకు ॥మంగ॥
8. పరమార్ధవ జూపుటకు భావంబులు మార్చుటకు
పరిశుద్ధాత్ముని కొరకు ప్రార్ధింతువ నీకు ॥మంగ॥
9. పరమపురి వాసునకు నరదైవరూపునకు
పరమేశ్వరతనjనకు బ్రణుతింతువ నిన్ను ॥మంగ॥