పాట `184
1. ఓ ప్రార్ధనా, సుప్రార్ధనా నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ వఖావఖీన్నే ప్రణుతింతు నీ ప్రభున్
నా ప్రాణమౌ సుప్రార్థనా నీ ప్రేరణంబుచేగదా!
నీ ప్రేమధార గ్రోలుదున్ నీ ప్రార్ధనా! సుప్రార్ధనా!
2. పిశాచి నన్నుయుక్తితో వశంబుజేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా! నా శైలమైన ప్రార్ధనా!
నా శోకమెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్ధనా!
3. నీ దివ్వమైన రెక్కలే నా దుఃఖభారమెల్లను
నా దేవుడేసు చెంతకు మోదంబు గొంచు బోవును
సదా సుఖంబు లొందను విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చు ప్రార్ధనా సుధా సుధార ప్రార్ధన
4. అరణ్యమైన భూమిలో నా రమ్యమౌ పిస్గా నగంబు
రంగుగాను నెక్కినా చిరగృహంబు జూతును శరీరవన్
విదల్చి నేబరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్
బరేశు ధ్యాన ప్రార్ధన