పాట `66
ప: నిర్మింపబడితిమి మనము దైవగృహముగా
తన కృపచే స్థిరపరచబడితిమి
1. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా
కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే ॥నిర్మి॥
2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే
పూజనీయుని పూజించెదము మనసారా మనము ॥నిర్మి॥
3. పరదేశులమై యున్న మనల తన ఇంటికి జెర్చె
ప్రాపుగ మనము ప్రస్తుతింతుము భక్తపాలకుని ॥నిర్మి॥
4. తన కార్యమును మనలో జేసి తన సేవకు పిలిచె
తనివిదీరగ స్తుతులర్పింతము వినయముగా మన ॥నిర్మి॥
5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీయేసు ప్రభునే
సర్వకాలము జయ శబ్ధముతో సన్నుతించెదము ॥నిర్మి॥