1. ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపిష్టున్నీవు సిల్వగన్
నీ రక్తంచేత గడ్గుమా యో గొర్రెపిల్ల దేవుడా!
2. ఉన్నట్టు నేను వచ్చెదన్ నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటతో హరించుమా యో గొర్రెపిల్ల దేవుడా!
3. ఉన్నట్టు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపర్చగన్
బాపంబు జేయ నీకుమా యో గొర్రెపిల్ల దేవుడా!
4. ఉన్నట్టు నేను వచ్చెదన్ యేసూ! కబోది నుండగన్
ఆత్మీయదృష్టి నీయుమా యో గొర్రెపిల్ల దేవుడా!
5. ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ మాట నవ్మనట్టినన్
మన్నించి చేర్చుకొమ్మయా యో గొర్రెపిల్ల దేవుడా!
6. ఉన్నట్టు నేను వచ్చెదన్ నీప్రేమ నన్ను బిల్వగన్
నీ వాడనౌదు సర్వదా యో గొఱ్ఱెపిల్ల దేవుడా!