పాట -293
ప: లోకమంతట వెలుగు ప్రకాశించెను - యేసు జన్మించినప్పుడు =
ఆకాశమందును గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు-లోకజ్ఞానులు
గొల్లలు వెళ్లి -లోకరక్షకుడేసుకు మ్రొక్కిరి ||లో||
1. నేను వెలుగై చీకటిలో వెలుగు చున్నాను-చీకటి దాని గ్రహింపలేదు=
నే ను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు-వాడు చీకటిలో
నడువక జీవపు వెలుగై యుండుడనె యేసు ||లో||
2. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను- చంద్రుడైనను నక్కరలేదు =
ఆ పట్టణములో దేవుని మహిమయే-ప్రకాశించుచున్నదియెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లో||
3. మీరు లోకమునకు వెలుగైయున్నారు గనుక-మీరు వెలుగు సంబంధులు
=మీరు కొండపైన కట్టబడిన పట్టణంబు వలెనే-మరుగైయుండక
నరులందరికి - వెలుగై యుందురనె యేసుండు ||లో||
4. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును-చూచిరి ధన్యులై- లోకమందు
మరణచ్ఛాయగల దేశనివాసులమీద-ప్రకాశించెను
గొప్పవెలుగు ప్రభువు యేసుకు పాడరే ||లో||