పాట `238
ప: అల్లానేరెడల్లో అల్లానేరెడల్లో
అల్లల్ల నేరెడెల్ల నేరెడెల్ల నేరెడల్లో
1. సుక్కాలు చేసినోడ చంద్రున్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా శ్రీయేసు దేవా దేవా! ూ।అ॥
2. నరజాతి గాన నెంచి నరరూపమెత్తినావా
కన్య మరియ గర్భమందు జన్మించినావా దేవా ॥అ॥
3. కుంటోళ్ళకు కాళ్ళిచ్చి గుడ్డోళ్ళకు కళ్ళిచ్చి
సచ్చి నోళ్ళ లేపినావా శ్రీయేసు దేవ దేవ ॥అ॥
4. నమ్మినోళ్ళకేమో స్వర్గం నమ్మనోళ్ళకేమో నరకం
నవ్మకుందు నిన్నే దేవా నా తండ్రి నీవేగావ ॥అ॥