పాట `246
ప: అంధకార బందుర లోకంలో యేసులేని మనిషిబ్రతుకు వ్యర్ధం అంతులేని ఆశలతో అంతం నిత్యనరక వారసులై చావు (2)
మనిషికి శాంతి లేదులే మరొక బ్రతుకులేదులే నువు ఏసువైపు
చూడాలి అన్న మనిషికి శాంతిలేదులే మరొక బ్రతుకులేదులే
నువు ఏసువైపు చూడాలి చెల్లి (2)
1. శాంతి కొరకు మద్యం పనికిరాదు శాంతి కొరకు ఆస్థి పనికిరాదు
శాంతి కొరకు jద్ధం పనికిరాదు సిలువ జెండా ఎత్తినపుడే శాంతి (2)
2. మోక్షం కోసం తీర్ధం వెళ్ళవద్దు మోక్షం కోసం డబ్బు ఖర్చువద్దు
మోక్షం కోసం రక్తంకార్చవద్దు శిలువచెంత చేరినపుడే మోక్షం (2)