పాట`212
ప.నిజముగా మొర్రపెట్టిన
దేవుడాలకించకుండునా?
సహనముతో కనిపెట్టిన
సమాధాన మియ్యకుండునా?
జీవము గల దేవుడు మౌనముగా నుండునా?
తన పిల్లల కాయన మేలు చేయకుండునా
1.సృష్టికర్తjైున దేవునికి
మన అక్కర తెలయకుండునా?
సరిjైున సమయానికి
దయచేయక ఊరకుండునా? ॥జీ॥
2.పరలోక తండ్రిని నడిగిన మంచి
ఈవుల నియ్యకుండునా?
కరము లెత్తి ప్రార్ధించిన
దీవెనలే కురియకుండునా? ॥జీ॥
3.ప్రార్ధించిన ఫలితము లేదా?
అందువలన ప్రార్ధన వలదా?
తండ్రితో సంబంధమే
ప్రార్ధనకు కారణం కాదా? ॥జీ॥