పాట `188
ప: దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు
1. ఏదేనులో ఆదాము తో నుండెన్ హనోకు తోడ నేగెను దీర్ఘ
దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ॥దేవు॥
2. దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగ నబ్రహాము
కన్న కొమరునిఖండిరచుటకు ఖడ్గము నెత్తినయపుడు ॥దేవు॥
3. యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు
శోధనలలో చెరసాలయందు సింహాసము మెక్కిన యపుడు ॥దేవు॥
4.ఎర్రసవద్రపు తీరవనందు ఫరో తరిమిన దినమందు
యోర్దాను దాటిన దినమందు యెరికో కూలిన దినమందు ॥దేవు॥
5.దావీదు సింహమునెదిరించి ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చిన యపుడు సౌలు
చేతరుమబడినపుడు ॥తోడు॥
6. సింహపుబోనులో దానియేలు షడ్రకు మేషాకబెద్నగో అగ్ని
గుండము లో వేయబడెన్ నల్గురుగా కనబడిపుడు ॥తోడు॥
7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన పుడు ॥తోడు॥