పాట`132
ప: యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధికస్తోత్రమే
1. ఇహపరమున మేలైన నామము శక్తిగల్గినట్టి నామమిది
పరిశుద్ధులు స్తుతించు నామమిది ` పరి ॥యేసు॥
2.సైతానున్ పాతాళమును జయించిన వీరత్వముగల నామమిది
జయమొందెదము యీ నామమున ` జయ ॥యేసు॥
3. నశించు పాపుల రక్షించులోకమున కేతెంచిన నామమిది
పరలోకమున జేర్చు నామమిది ` పర ॥యేసు॥
4. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది
లోకమంతా ప్రకాశించె నామమిది ` లోక ॥యేసు॥
5. శోధన గాధల కష్టసమయాన ఓదార్చినడుపు నామమిది
ఆటంకము తీసివేయు నామమిది ` ఆటం ॥యేసు॥