పాట`151
ప:నీ కృప మాకు చాలును నీ కృప మాకు చాలును
మా బ్రతుకు కాలమంతయు నీ కృప మాకుచాలును ॥నీ కృప॥
1. పూల బాటలోనైనను ముళ్ళ బాటలోనైనను
దీవెనైన క్షేమమైనను శ్రమబాధ శోధనైనను
నీవు మమ్మునడుపుచుండగా ఆగిపోము అలసిపోముగా (2) ॥నీకృప॥
2. ధనము బలములందు మేము అతిశయింపము
జ్ఞానము సంపాద్యమున్నఢంబము చూపము
మా అతిశయం నీనామమే మా పరవశం నీవే
యేసయ్యా నీవే మా బలము శక్తి సామర్థ్యము (2) ॥నీకృప॥