పాట `219
1.రాత్రి యయ్యెన న్నెడ బాయకు ` ధాత్రిపై జీకటులు గ్రమ్మెను
సహాయ మేమి లేనివారికి ` సహాయుడా, నన్బాసి పోకుమీ,
2. ఏ కాలంబై న నీ సహాయము ` లేక పిశాచిన్ గెల్వజాలను
నీ కంటె దిక్కు నాకు లేదుగా ` లోక ప్రకాశుడా, నన్బాయకు
3. నా చెంత నీకు చేరియుండగ ` ఏ చింతjైున నన్ను సోకునా
ఏ శత్రువైన నన్ను గెల్చునా ? ` నా శైలమా, నన్బాసిపోకుమా,
4. సమృద్ధుడు సహాయు డాయెను `ఓ మృత్యువా
ముల్లు గెల్చునా ?సమాధి నీరు జయమబ్బునా? `
మా మధ్యమున్ సర్వేశపాయకు
5. రేవు నే జేర బోవు వేళలోన్ ` కావుమయ్యా నీ దీప్తి జూపుచున్
చావు జీవంబులందు నైనను ` నీవు తోడై నన్బాసి పోకుము.