ప:అపరాధిని యేసయ్య
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీకృపలో
నపరాధములను క్షమించు (అప)
ూశీఅస్త్ర-320
1.సిలువకు నిను నేగొట్టితిని
తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (అప)
2. ప్రక్కలో బళ్లెపుపోటు
గ్రుక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితివయ్యా (అప)
3.ముళ్ళతో కిరీటంబు నల్లి
నీశిరమున నిడితి
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రీ (అప)
4.దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావనిడితి
ద్రోహుండైన జేసితి నీ
దేహంబు గాయంబులను (అప)
5.ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితినీ
క్రూరుండవై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (అప)
6.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత
నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా (అప)
7.శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయభాగ్యము నియ్య
మోక్షం
బు జూపితివయ్యా (అప)