పాట`315
ప: జీవపు మార్గజ్యోతివి సిలువ మోసిన యేసు
మహిమ పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు
1. శరీర ధారివైతివి నీ ప్రేమను కనుపరచితివి
దీనుల నుద్ధరించితివి సిలువ మోసిన యేసు ॥జీవపు॥
2. నీవే మార్గ సత్యమని నీకు పేరు కలిగెను
నిత్య జీవపు దాతవు పునరుత్థానుడవు నీవే
॥జీవపు॥
3. అర్పణ చేసితివి బలిగా సిలువపై నీ ప్రాణమును
కడిగితివి నీ రక్తముతో సిలువ మోసిన యేసు
॥జీవపు॥
4. నీ ద్వారమున జేరితిమి నీచులము అయోగ్యులము
నీకే మహిమ స్తుతి ఘనత సిలువ మోసిన యేసు
॥జీవపు॥
5. కల్వరి మార్గయాత్రికులం నీకే జయమని పాడెదము
సర్వద నిను స్తుతియించెదము సిలువ మోసిన యేసు
॥జీవపు॥