ప: సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపైనున్న మంటినయ్యా సరిjైున పాత్రన్ జేయు మయ్యా
సర్వేశ్వరానే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును (సర్వ)
1. ప్రభు! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీసన్నిధిన్
పరికింపునన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్జేసి పాలింపుమా పాపంబుబ్రోవ నన్ను కడుగుమా (సర్వ)
2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నారక్షకా నీచమౌ
గాయములచేతను నిత్యంబు కృంగి అలసియు ండ నిజమైన
సర్వశక్తుండవే నీ చేత బట్టినన్ రక్షింపుమా (సర్వ)
3. ఆత్మ స్వరూప నీచిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున
అధికంబుగా నన్నీ ఆత్మతో ఆవరింపుమో నారక్షకా అందరు
నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా (సర్వ)