ప: సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్ ( సృష్టి)
1. భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు
నీవే భూప్రజలు నీవారే బలశౌర్యములు నీవే (సృష్టి)
2. మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా
దేహముల్ మా గేహముల్ మాజీవితవము నీవే (సృష్టి)
3. వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు
వివిధంబులైన దీవెనలు నీకరుణావర్షములు (సృష్టి)
4. పరిశుద్ధగ్రందపు పలుకులు పరలోక తేనెచినుకులు
ప్రభుయేసుని మాటలు మా వెల్గుబాటలు (సృష్టి)
5. మా దంత నీదే మహాదేవా మారాజువయ్యా
యెహోవా మాతనువుల్ మా యావదాస్తినీవే (సృష్టి)
6. మే మిచ్చుకాన్క యేపాటిది యే ప్రేమ నీకు
సాటిది మోక్షనాధా యేసుప్రభో అంగీకరించు విభో (సృష్టి)
7. తండ్రికుమార శుద్ధాత్ముడా త్రియేకదేవ స్తోత్రవల్ దాతనీవే
నేతనీవే దేవాదిదేవుండవే (సృష్టి)