పాట `36
ప: ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్ ఆనందం ఆనందమే
ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ॥ప్రియుడా॥
1.నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లవ పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా
మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ॥ప్రియుడా॥
2.బలియున గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే
పరిశుద్ధ రక్తము నాకొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ॥ప్రియుడా॥
3.ఎన్నెన్నో ంక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా
రక్తము చిందించి సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా యేసునాధా ఆరాధనా ఆరాధనా (ప్రియుడా)