పాట`317
ప: జై ! జై! యేసురాజా ! జై ! జై ! రాజాధిరాజా ! నీకే జై! జై!
1. పాపకూపములో బడియున్న నన్ను జూచి
చేయిజూచి చక్కగ దరికిజేర్చితివి ॥జైజై॥
2. సిలువ రక్తములో నన్ను కడిగి పాపమంతా
పరిహరించిన పావనుడగు నా ప్రభుయేసు ॥జైజై॥
3. నీతిహీనుడనైన నాకు నీతి రక్షణ వస్త్రమును
ప్రీతితో నొసగిన నీతి రాజా ! ॥జైజై॥
4. మంటిపురుగునైన నన్ను మంటినుండి
మింటజేర్చిన మహా ప్రభుండా! నీకే జైజై ॥జైజై॥
5. పాప శాపగ్రస్తుడనై యుండ నన్ను గూడ
నీ స్వకీయ సంపాద్యముగా జేసితివి ॥జైజై॥
6. రాజులైన యాజక గుంపులో నన్ను గూడ
నీ సొత్తయిన పరిశుద్ధ జనములో జేర్చితివి ॥జైజై॥
7. తల్లిjైున మరచిన మరచును నేను నిన్ను
మరువననిన నమ్మకమైన నా ప్రభువా! ॥జైజై॥
8. అధిక స్తోత్రార్హుడవైన ఆదియంతములేని దేవా
యుగా యుగములకు నీకే జైజై ॥జైజై॥