పాట `71
ప: నా యేసు నాతో నుండగా అదియే నాకు పండుగ
నా త్రోవకు వెలుగుగా తేనెకంటె తీపిగా
1. నా ప్రాణ ప్రియుడేసు ధవళవర్ణుడు ఆయనే
రత్న వర్ణుడు ఆయనే పదివేలలో ఒక్కడే ॥నా॥
2. యేసయ్య మంచి కాపరి నిజమైన ద్రాక్షవల్లి
ఏ అపాయము కలుగదు నిలచి ఫలింంచెదము ॥నా॥
3. నిత్యుడైన తండ్రియు సమాధాన కర్తగా
ఆలోచన కర్తయు అని పేరులు కలిగెను ॥నా॥
4. కడబూర మ్రోగగా కంటి రెప్పలో మారెదన్
కలిసెదను యేసు నీ కన్నీరు తుడిచెను ॥నా॥