పాట`128
ప: మన మేసుని వారలము తనవారిగానే యుందుము
మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము
1. కృపాసత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయెను
కనుగొంటిమి తండ్రి మహిమను జనితైక కుమారునిలో
తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము ॥మన॥
2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కల్గెను
మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే
ప్రభు వుత్తముడని యెరిగి తనకే స్తుతి పాడెదము ॥మన॥
3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో యింటిని కట్టుచున్నాడు
దేవుని తేజము రాగా మహిమతో నిండె గృహము
ఆయన మందిరములో తన మహిమను పాడెదము ॥మన॥
4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో వారిని నిర్ణయించెను
పిలిచి నీతిగా తీర్చి మహిమ పరచెను తన తనయుని
రూపమిచ్చె మనమానంద మొందెదము ॥మన॥
5. పూర్ణ మహిమతో మన ప్రభుయేసు దూతలతో వచ్చును
కనిపెట్టు వారెత్తబడుదురు తన మహిమ పొందెదరు
తన రాజ్యముగా జేసె హల్లెలూయ పాడెదము ॥మన॥
6. మహిమ నివసించు మహిమ రాజ్యము మహిమతో నిండి యుండును
మన ప్రభువే దీపమై యుండును తన వెలుగు ప్రచురమగున్ యుగ
యుగములు మనమంతా ప్రభుయేసుతో నుండెదము ॥మన॥