పాట `220
1. యేసు స్వామి నీకు నేను నాసమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును
॥నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నీకిత్తు నా సమస్తము॥
2. యేసుస్వామి నీకె నేను దోసిలొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల యేసు చేర్చుమిప్పుడే ॥నా సమ॥
3. నేను నీవాడను యేసు నీవును నావాడవు
నీవునేను నేకమాయె నీ శుద్ధాత్మ సాక్ష్యము ॥నా సమ॥
4. నీకు నన్ను యేసుప్రభూ ఈయనేనె యేగితి
నీదు ప్రేమశక్తి నింపు నీదు దీవెనియ్యవే ॥నా సమ॥
5. యేసు నీదె నా సర్వాస్థిహాసుజ్వాలన్ బొందితి
హాసు రక్షణానందమా హల్లెలూయా స్తోత్ ॥నా సమ॥