417
ప:ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీనస్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్య
1.నా పాపమూ బాప నరరూపివైనావు
నా శాపమూ బాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే (2)
నా స్థానమూ లో నీవే (2) (హ)
2.నీ రూపమూ వ నాలో నిర్మించియు న్నావు
నీ పోలికలోనే నివసించు చున్నాను
నీవు నన్ను ఎన్నుకొంటివిగా (2)
నీ కొరకై నీ కృపలో (2) (హ)
3.నా శ్రమలు సహించి నా ఆశ్రయమయి నావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకొన్నావు (2)
నన్ను దాచియుంచావు (2) (హ)
4.నీ సన్నిధి నాలో నా సర్వమూ నీలో
నీ సంపద నాలో నా సర్వస్వమూనీలో
నీవు నేను ఏక మగువరకు (2) నన్ను విడువనంటివో దేవా (హ)
5.నా మనవులు వందే నీ మనస్సులో నెరవేరే
నా మనుగడ మూందే నీ గ్రంధమూలో నుండె
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం (2) నేనేమి చెల్లింతున్ (2)