పాట `179
1. సిల్వచెంత నేసువా ` చేర్చి నన్ను నుంచు
కల్వరిన్ స్రవించెడు ` కాల్వలో నన్ముంచు
॥సిల్వకే సిల్వకే ` చెల్లునా విముక్తి
చెల్వ మొప్ప నద్దరిన్ ` జేర నాకు ముక్తి ॥
2. కంపితాత్ము నంధునై ` కానలేక యుండ
సొంపు మీర బ్రోచితి ` సూర్య తేజ స్కుండ
3. దేవ గొఱ్ఱె పిల్ల నీ ` దీప్తి నాకు జూపు
నీ వధా ప్రభావముల్ ` పావనుండ నేర్పు
4. నే నిరీక్షణంబుతో ` నెప్డు వేచి యుందున్
భూనితాంత వారధి ్ ` బూని యీది మన్దున్.