పాట `116
1.మా సృష్టికర్త నీవే దేవా నిర్మించితివి మమ్ము నీ రూపములో (2)
నింపితివి మమ్ము నీ ఆత్మతో (2)
ప:నీకే స్తోత్రము మా కుమ్మరివాడా నీకే స్తోత్రము మా రక్షకా (2)
నిత్యము నిన్నే కొనియాడెదన్ (2
2.సారే పై నున్న మంటినయ్యా పలుమార్లు విరిగి పగిలితిని (2)
విడువని నీదు ప్రేమతో నన్ను నీదు ప్రేమతో మలచితివి నీ పాత్రగా (2)
3.చేదైన పాపంతో నిండిన నన్ను నీ రక్తధారలచే (2)
కడిగితివి మార్చితివి నీదుమాధుర్యంతో
జుంటె తేనెల వాక్యముతో (2)