పాట--490
ప.స్తుతియూ మహిమా ఘనాతా నీకే
యుగయుగములు కలుగును దేవా
పరమందు దూతలతో, ఇహమందు శుద్ధులతో
కొనాయాడబడుచున్న దేవా ఆరాధనా ఆరాధనా (4
1.పరిశుద్దుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసియించువాడా
ఆరాధనా ఆరాధనా ||స్తుతియూ||
2.స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా
ఆరాధనా ఆరాధనా ||స్తుతియూ||
3.మహిమా నీకే మహోన్నతుడా మనసార నిన్నే స్తుతియంతునూ
ఆరాధనా ఆరాధనా ||స్తుతియూ||
నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా పరవశము
యేసయ్యా నా యేసయ్యా ||3||