ప: నీతో సమమెవరు - నీలా ప్రేమించేదెవరు
నీలా క్షమియించేదెవరు - యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు (2)
1. లోక బంగారము - ధన ధాన్యాదులు
ఒక పోగేసినా - నీతో సరితూగునా
జీవ నదులన్నియు - సర్వసంద్రములు
ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా ||నీతో||
లోక సౌఖ్యాలన్ని ఒక చోట క్మురించిన నీవేగా చాలిన దేవుడవు
2. పలు వేదాలలో - మత గ్రంథాలలో పాపమే సోకని - పరిశుద్దుడేడి
పాప పరిహారార్ధం - సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకుడవు ||నీతో||
3. నేను వెదకకున్నా - నాకు దొరికితివి
నేను ప్రేమించకున్నా - నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి - తరచు రేపితిని
నన్నెంతో సహించి - క్షమియించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడెవ్వరు నీవేగా మంచి దేవుడవు ||నీతో||