పాట`156
ప: మేము భయపడము ఇక మేము భయపడము
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు ॥మేము॥
1. దైవభ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా
రక్షించెదివారాత్రులు దేవుడే కాయును ॥మేము॥
2. శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును ॥మేము॥
3.అగ్ని పరీక్షల యందు వాగ్ధానమిచ్చె
మాతో నుండయేఘడిjైునను విడువక కాయును ॥మేము॥
4.బలమైన ప్రభు హస్తములు వలయమువలె
మమ్ముజుట్టిపలు విధములుగా కాపాడుమమ్ము ॥మేము॥
5.కునుకడు మనదేవుడు యెన్నడు నిద్రించడు
కనుపాపగ మము కాపాడునెప్పుడు ॥మేము॥
6.జీవిత కష్టనష్టములు ఆవరించి దు:ఖపరచ
దేవుడొసంగిన ఈవుల నెంచుచు ॥మేము॥
7.ఇహమందు మన శ్రమలన్ని మహిమకుమార్చెడు
ప్రభున్మహిమపరచి మ్రొక్కెదమిలలో ॥మేము॥