పాట `187
ప: నీవు తోడైయున్న జాలు యేసు నిత్యవ నాకది మేలు
నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్లగావ బ్రేమవచ్చి
ఘనప్రాణమిడినట్టి ॥నీవు॥
1. నినుబోలు రక్షకుండేడి? క్రీస్తు ననుబోలు పాతకుండేడి
నినునము ్మవారలకు నీ వొసగుచుందువు దనర
పాపక్షమ దయచేత నిలలోన ॥నీవు॥
2. నీపాటి బలవంతుడేడి? ప్రభు నాపాటి దుర్భలుండేడి
కాపాడుచుందువు కలకాలము ను నీవు నీ పాదసేవకుల
నీ నేర్పు రంజిల్ల ॥నీవు॥
3. నీవంటి యుపకారియేడి? కర్త నావంటి కడుదీనుండేడి
జీవులకును గల్గు జీవంబులిచ్చుచు జీవాధారము లొసగి
జీవుల బ్రోచెడి ॥నీవు॥
4. నీవంటి ధనవంతుడేడి? యేసు నావంటి ధనహీనుండేడి
ప్రోవులైయున్నవి రూవులు నీయందు నీవు వాని నొసంగి
నిరతంబు ననుగావు ॥నీవు॥