పాట `177
ప: నీ స్వరవ వినిపించు ప్రభువా నీదాసు డాలకించున్నీ వాక్యవ
నేర్పించు దానియందు నడుచునట్టు నీతో ॥నీస్వర॥
1.ఉదయవనే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి ॥నీస్వర॥
2.నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిజేసికొందు
నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడు ॥నీస్వర॥
3.భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము
అభయము నివ్మ ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను ॥నీస్వర॥
4.నాతో మాట్లాడుము స్పష్టవగా ప్రభువా నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యముద్వారా ॥నీస్వర॥
5.నీ వాక్యము అగ్నిసుత్తె వంటిది అది రెండంచులు గల ఖడ్గంనీ
వాక్యమేగా అద్భుత అద్దం నిజ స్వరూపము చూపించున్ ॥నీస్వర॥
6.నా హృదయము లోని చెడుతలంపులనుచేధించు నీ వాక్యంనీ రూపవనకు
మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా ॥నీస్వర॥