పాట`133
ప: హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి
1. పాపభారము మోయున్ వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు
నిత్యజీవము నిచ్చెన్ ॥హృదయ॥
2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరిచెను ప్రభువు నిత్య నిరీక్షణ నిచ్చెన్ ॥హృదయ॥
3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో ॥హృదయ॥
4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల ఇదియే మా వినతి ॥హృదయ॥