పాట `51
ప: దేవుని స్తుతింంచుడీ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడీ ఆ ఆ..
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిదిలో
ఆ ఆ... ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు ॥దేవు॥
2. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశ విశాలమందు
ఆ ఆ... ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు ॥దేవు॥
3. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన ప్రభావమును
ఆ ఆ... ఆయన ప్రభావమును ఎల్లప్పుడు ॥దేవు॥
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలములతో
ఆ ఆ... స్వరమండలములతో ఎల్లప్పుడు ॥దేవు॥
5. సన్నని తంతుల సితారతోను చక్కని స్వరములతో
ఆ ఆ... చక్కని స్వరములతో ఎల్లప్పుడు ॥దేవు॥
6. తంబురతోను నాట్యముతోను తంతి వాంద్యములతోను
ఆ ఆ... తంతివాధ్యములతో ఎల్లప్పుడు ॥దేవు॥
7. పిల్లన గ్రోవుల చల్లగ నూది యెల్ల ప్రజలు చేరి
ఆ ఆ... యెల్ల ప్రజలు జేరి ఎల్లప్పుడు ॥దేవు॥
8. మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడీ గంభీర తాళముతో
ఆ ఆ... గంభీర తాళముతో ఎల్లప్పుడు ॥దేవు॥
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా
ఆమేన్ ఆ ఆ... హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు ॥దేవు॥