పాట `55
ప: యేసయ్య నామం ప్రీతిగల నామం
సాటిలేని నామం మధుర నామం
1. పాపము పోవును భయమును పోవును
పరమసంతోషము భక్తులకీయును ॥యేసు॥
2. పరిమళ తైలము యేసుని నామం
భువిలో సువాసన వీచెడి నామం ॥యేసు॥
3. నిన్న నేడు మారని నామం
నమ్మిన వారిని విడువని నామం ॥యేసు॥
4. సాతాను సేనను జంంచెడి నామం
శోధనలన్నిటి బాపెడి నామం ॥యేసు॥
5. భూలోకమంత మేలైన నామం
సైన్యాధిపతియగు యేసుని నామం ॥యేసు॥
6. ప్రతివాని మోకాలు వంచెడి నామం
ప్రతివాని నాలుక స్తుతించెడి నామం ॥యేసు