ప:పేద నరుని రూపము దరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను
పాట `351
1.కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె
ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలుచుచుండె
॥పేద నరుని॥
2.తలవాల్చుటకు ఇల స్థలమేలేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె
పాట్లుపడె నిన్ను విడిపింపను
॥పేద నరుని॥
3.ఈ దినమే ఈ క్షణమే రమ్ము నీవు
అంగీకరించుము క్రీస్తు ప్రేమను
చాచియున్న చేతులలో రక్తదారాలు
ఆ రక్తమే నిను శుద్ధీకరించును
నీ సృష్టికర్తను నీవు చేరుమా
నీ రక్షణకర్తను నీవు సేవించుమా
తన సొత్తు నీవనెను నీకై తన ప్రాణమే ఇచ్చెను
4.ప్రభు సాతాను తలను చితుకద్రొక్కెన్
పాపడాగులన్ రక్తముతో కడిగెన్
నీ వ్యాధిని వేదన తొలగింప
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందె
॥పేద నరుని॥
5.మాయలోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవునిల
నిత్యదేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో
॥పేద నరుని॥
6.తామసించెద వేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచెండె
॥పేద నరుని॥