పాట`149
ప: ఆ.. ఆ...ఆ ...
యేసూ నీవే కావాలయ్య
నాతో కూడ రావాలయ్య (2)
ఘనుడా నీ దివ్య సన్నిధి
నను ఆదుకొనే నా పెన్నిధి (2)
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా (2)
1. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు (2) ॥నీవే॥
2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు (2) ॥నీవే॥
3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు (2) ॥నీవే॥