పాట`230
ప:ఓ సోదరా! ఓ సోదరీ
యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు
నిదుర మాను మగత వీడు
కన్ను విప్పి కలియచూడు
॥ఓ సోదరా॥
1.యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి
ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి
ప్రార్థనా యుదముతో పునరుత్థాన శక్తితో (2)
పునర్నిర్మాణము చేతము రండి (2)
॥ఓ సోదరా॥
2.నిరాశ నిసృహలు ఎదురు నిలిచిన
నిందలెన్ని మబ్బులుగా మనల క్రమ్మిన
నిలచెదం యేసుతో నడిచెదం దీక్షతో (2)
నిరీక్షణ బలముతో సాగిపోదము (2)
॥ఓ సోదరా॥
3.అపవాది బాణములు ఎన్నివిసిరినా
అగ్ని గంధకముల వాన చుట్టు ముసిరిన
అదరము బెదరము అరికి మనము
వెరవము (2)
అన్న యేసు సన్నిధిలో లేదిక భయము (2)
॥ఓ సోదరా॥
4.సంఘమునగ యేసు క్రీస్తు దేహమే గదా
చావు నోడిరచినది ఈ దేహమే గదా
సిలువ తేజస్సుతో కరుణమూర్తి మనసుతో
(2)
సిరులు విరయు జీవితాలు నిర్మిద్దాము (2) ॥ఓ సోదరా॥
5.యేసే ఈ సంఘమునకు అసలు పునాది
యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి
యేసే ఆరంభము ఆయనే అంతము (2)
యేసే మన జీవితాల నవవసంతము (2) ॥ఓ సోదరా॥
6.సాక్ష్యామిచ్చు సంఘమే జీవించే సంఘము
జీవించే సంఘమే సాక్షమిచ్చు సంఘము
సాక్ష్యము విశ్వాసము సఖ్యము సహవాసము
(2)
సిలువ చులువ పందిరిలో వర్ధిల్లాలి (2)
॥ఓ సోదరా॥
7.విజయమంత నిజముగా యేసు ప్రభునిదే
కుజనుడైన సాతాను ఓడిపోవులే
సృజనాత్మక శక్తితో సిలువత్యాగ స్ఫూర్తితో (2)
స్వార్థ రహిత సేవలను సాగిద్దాము (2)
॥ఓ సోదరా॥
8.శాంతి ధ్వజము మనముందు నడుచుచుండగా
సిలువజ్యోతి మార్గమును చూపుచుండగా
సాగు నీ ఉద్యమము ఆగదు ఈ రథం (2)
స్వామి యేసు సామ్రాజ్యం నిలుచును నిరతం
(2)
॥ఓ సోదరా॥