మీరు లోకమునకు ఉప్పుయి ఉన్నారనిన
యేసయ్యా నన్ను చేయుము ఈ లోకాన నీ సాక్షిగా
ఉ.ప.ఇదియే ప్రార్థన, ఇదియే విజ్ఞాపన
ప్రభువా ఇదియే నా హృదయ ప్రార్థన
ూశీఅస్త్ర-277
1.నీ ప్రేమ రుచియించుట ఎంతో ధన్యం
నీ ప్రేమ మాధుర్యము నాలో నింపు
నీ ప్రేమ పంచుటకు నన్ను నిలుపుమా
నీతో నడుచుటకు నన్ను మలచుమా
2.సారము కలిగిన ఈ జీవితం
ఆదరణ కలిగించు విశ్వాసము
ఆశీర్వాదకరమైన ఉప్పుగా
ఈధరలోనా నన్ను చేయుమా
3.పరిశుద్ధతతో జీవించుటకు
ప్రతిస్థలమున, ప్రతి సమయాన
నీ మహిమ కొరకు నా ప్రతి దారిన్
నీ కొరకు జీవింప నన్ను చేయుమా
4.పిలచితివి, ఏర్పరచుకొంటివి
ఈలోకములో నన్ను నీవు
నమ్మకమైన సాక్షిగా
నీ జీవముతో నన్ను నింపుమా