పాట`138
ప:మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి
మాసామర్థ్యము పునరుత్థానము మాజీవము మారక్షణనిధి
1.ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించువాడు పరిశుద్ధుడు అయిననునలిగిన
వినయంపు దీనమనస్సులో నివసించును జీవించును
2.దినమెల్ల ప్రభుకై వధియింపబడి యున్నట్టి గొఱ్ఱెలము అయినను
ప్రేమించినవాని ప్రేమను బట్టియే పొందితిమి విజయమును
3.మోసము, శిక్షయు, దు:ఖమును, దరిద్రత కలిగియున్నాము
అయినను సత్యము, జీవము, సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి
4.పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా అయినను
తిరిగి లేతుము యెహోవాయె మా వెలుగు మా రక్షణ
5.మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి అయినను
ఎల్లప్పుడు వూరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు